: నన్ను ఇలా చూడడం అభిమానులకు నచ్చింది: వెంకటేష్


తనను డిఫరెంట్ లుక్ లో చూడడం అభిమానులకు నచ్చిందని ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. 'గురు' సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, తనకు కూడా కేరెక్టర్ బాగా నచ్చిందని చెప్పారు. కొత్తగా తనను చూపించడం నచ్చిందని అన్నారు. సినిమా షూటింగ్ టైంలో తనను ఎలా ఆదరిస్తారో అన్న అనుమానం ఉండేదని, అయితే సినిమా విడుదలైన తరువాత అభిమానుల స్పందన చూసి టెన్షన్ పోయిందని చెప్పారు.

అభిమానులు చాలా తెలివైనవారని, సినిమాలో తమకు నచ్చిన అంశాలు లేకపోతే చూడడం లేదని, అలాంటి వారికి తాము మంచి అనుభూతిని పంచామని అన్నారు. తెలుగు అభిమానులు కూడా మంచి సినిమాలను ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించిందని, సినిమా చూసిన ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తున్నారని వెంకీ చెప్పారు. 

  • Loading...

More Telugu News