: సినీ ఇండస్ట్రీలో అలాంటి అనుభవం నాకు ఎదురు కాలేదు: నటి కాజల్
సినిమాల్లో అవకాశాల పేరిట హీరోయిన్లను తమ పడక గదులకు రమ్మంటారనే వార్తలపై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ స్పందించింది. సినీ ఇండస్ట్రీలో అలాంటి అనుభవం తనకు ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పింది. అయితే, ఇతర హీరోయిన్లు తమకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్టు తనతో చెప్పారని, అవకాశాలు ఇవ్వాలంటే, ఆయా దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమకు ‘సెక్సువల్ ఫేవర్’ కావాలని కోరతారనే విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఇలాంటి పరిస్థితులు సినీ ఇండస్ట్రీలో ఉండటం చాలా బాధాకరమని కాజల్ చెప్పుకొచ్చింది. కాగా, ఇలాంటి చేదు అనుభవం తనకు ఎదురైందని మలయాళ నటి పార్వతి ఆవేదన చెందిన విషయం తెలిసిందే.