: ఇంట్లో మాత్రం కుస్తీ పట్టకండి!: సాక్షి మాలిక్ దంపతులకు సెహ్వాగ్ సలహా
హర్యానాలోని రోహ్తక్లో నిన్న ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ వివాహం ఘనంగా జరిగింది. ఆమె భర్త సత్యవర్త్ కూడా అంతర్జాతీయ స్థాయి రెజ్లరే. ఈ సందర్భంగా వారికి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలుపుతూ.. వారి పెళ్లికి వెళ్లలేకపోయానని అన్నాడు. అందుకు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కారణమని చెప్పాడు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయన అన్నాడు. ఇంట్లో మాత్రం ఈ రెజ్లింగ్ దంపతులు కుస్తీ పట్టకూడదని ఆటపట్టించాడు.
Wish you a very happy married life @SakshiMalik . Couldn't make it because of IPL camp. Best wishes for a life of joy and no kushti at home
— Virender Sehwag (@virendersehwag) April 2, 2017