: చూస్తూ ఊరుకుంటే ప్రజాస్వామ్యం బతకదు: జగన్


అధికారంలో ఉన్న వారు ప్రజాస్వామ్యాన్ని పాతరవేస్తుంటే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఉన్న వారిని మంత్రులుగా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గవర్నర్ చర్యలు తీసుకోకపోతే తాము చూస్తూ ఊరుకోమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి వద్దకు వెళ్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతిని కలిసి పరిస్థితి వివరిస్తామని ఆయన చెప్పారు. దీనిపై పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన వారు రాజీనామా చేసేంతవరకు విశ్రమించమని, అవసరమైతే బై ఎలక్షన్స్ కు వెళ్లేందుకు కూడా సిద్ధమని ఆయన అన్నారు. బై ఎలక్షన్స్ లో ప్రజలు, దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News