: ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు!
ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఈ రోజు శాఖల కేటాయింపు జరిగింది. అలాగే కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న యువనేత నారా లోకేశ్ కి ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు.
ఆయా మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు
మంత్రి పేరు | కేటాయించిన శాఖ |
---|---|
చంద్రబాబునాయుడు ( ముఖ్యమంత్రి ) | సాధారణ పరిపాలన, పెట్టుబడులు - మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమం - సాధికారత, సినిమాటోగ్రఫీ, హేపీనెస్ ఇండెక్స్, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు |
కేఈ కృష్ణమూర్తి ( ఉప ముఖ్యమంత్రి ) | రెవెన్యూ, స్టాంపులు - రిజిస్ట్రేషన్స్ |
నిమ్మకాయల చినరాజప్ప ( ఉప ముఖ్యమంత్రి ) | హోం, విపత్తుల నిర్వహణ |
యనమల రామకృష్ణుడు | ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, శాసనసభ వ్యవహారాలు |
అయ్యన్న పాత్రుడు | రోడ్లు, భవనాలు |
కళా వెంకట్రావు | విద్యుత్ |
అచ్చెన్నాయుడు | రవాణా, బీసీ సంక్షేమం - సాధికారత, చేనేత, జౌళి |
సుజయ కృష్ణ రంగారావు | గనులు, జియాలజీ |
గంటా శ్రీనివాసరావు | మానవ వనరుల అభివృద్ధి ( ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్య ) |
పితాని | కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు |
జవహర్ | ఎక్సైజ్ |
నారాయణ | పురపాలన, పట్టణాభివృద్, పట్టణ గృహనిర్మాణం |
కొల్లు రవీంద్ర | న్యాయ, నైపుణ్యాభివృద్ధి , యువజన, క్రీడలు, నిరుద్యోగులకు ప్రయోజనాలు, ఎన్ ఆర్ ఐ సాధికారత సంబంధాలు |
శిద్ధా రాఘవరావు | అటవీ, పర్యావరణం, శాస్త్ర - సాంకేతికం |
అమర్ నాథ్ రెడ్డి | పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు |
కాల్వ శ్రీనివాసులు | గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలు |
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి | వ్యవసాయం, ఉద్యానం, పట్టు పరిశ్రమ, అగ్రి ప్రాసెసింగ్ |
పరిటాల సునీత | మహిళా సాధికారిత, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, సెర్ఫ్ ( వెలుగు ) |
ప్రత్తిపాటి పుల్లారావు | పౌరసరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు |
కామినేని | ఆరోగ్యం, వైద్యవిద్య |
మాణిక్యాల రావు | దేవాదాయం |
దేవినేని ఉమా మహేశ్వరరావు | జలవనరుల నిర్వహణ |
ఆదినారాయణరెడ్డి | మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధకం, పాడిపరిశ్రమ, మత్య్స , సహకారం |
నక్కా ఆనంద్‌బాబు | సాంఘిక సంక్షేమం - సాధికారిత, గిరిజన సంక్షేమం - సాధికారిత |
నారా లోకేశ్ | ఐటీ, కమ్యూనికేషన్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి |
భూమా అఖిలప్రియ | పర్యాటకం, తెలుగు భాష, సంస్కృతి |