: రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం.. రాష్ట్ర పరిస్థితులపై చర్చలు!


నిన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గంలో కొత్తగా 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌రువాత తొలిసారి క్యాబినెట్ స‌మావేశం కానుంది. ఈ భేటీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ఈ స‌మావేశ‌ంలో ప్ర‌ధానంగా రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు అధికారులతో భేటీలో పాల్గొంటున్నారు. మంత్రులకు ఇవ్వనున్న శాఖల జాబితాపై ఈ రోజు సాయంత్రంలోపు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎస్ దినేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News