: ఏ శాఖ ఇవ్వాలి? ఎక్కడ కూర్చోబెట్టాలి?: సీఎస్ తో చంద్రబాబు కసరత్తు!
కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకున్న వారికి ఏఏ శాఖలు అప్పగించాలన్న విషయమై, కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ఉదయం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన తరువాత సీఎస్ దినేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రలతో చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రులకు ఇవ్వాల్సిన శాఖలు, ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మంత్రులు సచివాలయానికి వస్తే, వారికి సరిపడా చాంబర్లు లేకపోవడంతో, విజయవాడ, గుంటూరు పరిసరాల్లో గతంలో ఎంపిక చేసిన భవనాల్లో మంత్రివర్గ కార్యాలయాలను కొనసాగించే అంశంపైనా వీరు మాట్లాడుకున్నట్టు సమాచారం. నూతన మంత్రులకు నేడు శాఖలు ఖరారు కానున్న సంగతి తెలిసిందే.