: శ్రీకృష్ణుడు కూడా పేరుమోసిన ఈవ్‌టీజరేనట.. ‘ఆప్’ మాజీ ఎమ్మెల్యే ఉవాచ!
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. శ్రీకృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడు పేరుమోసిన ఈవ్ టీజర్ అని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ‘యాంటీ రోమియో స్క్వాడ్’కు ‘యాంటీ కృష్ణా స్క్వాడ్’ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆ దమ్ముందా? అని ప్రశ్నించారు. ‘‘రోమియో ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. కానీ శ్రీకృష్ణుడు పురాణాల్లో పేరుమోసిన ఈవ్ టీజర్‌గా నిలిచిపోయాడు’’ అని పేర్కొన్నారు. హిందూ పురాణాల్లో కొందరు దేవుళ్లు ఈవ్ టీజర్లు అయినా వారిని కూడా దేవుళ్లుగా కొలుస్తున్నారంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఆయన రోమియా బ్రిగేడ్ మీద తన ట్వీట్‌ను వక్రీకరించారని, ఏ ఉద్దేశంతో అయితే రోమియో బ్రిగేడ్‌ను పెట్టారో, దాని ప్రకారం చూస్తే కృష్ణుడు కూడా ఈవ్ టీజరే అవుతాడనేదే తన ఉద్దేశమని, హిందూ సెంటిమెంట్‌ను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదంటూ మరో ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు.