: రాజీనామాకు సిద్ధమైన మరో ఇద్దరు... అజ్ఞాతంలోకి వెళ్లిన బండారు!


ఏపీ మంత్రి వర్గ విస్తరణ అధికార తెలుగుదేశం పార్టీలో పుట్టించిన ప్రకంపనల ప్రభావం కొనసాగుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలకబూనిన విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గన్ మెన్ లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో బండారు ఉన్నట్టు సమాచారం. ఇక సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ తన తండ్రి గౌతు శివాజీకి పదవి ఇవ్వలేదని ఆరోపిస్తూ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శిరీష నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఉదయం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాజీనామా చేయగా, దాన్ని ఆమోదించాలా? వద్దా? అన్న విషయాన్ని చంద్రబాబు ఇంకా స్పష్టం చేయలేదు.

  • Loading...

More Telugu News