: సిరియా సరిహద్దుల్లో భారీ దాడులు... 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
సిరియా నుంచి సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్రవాదులపై అమెరికా సంకీర్ణ దళాల సాయంతో ఇరాక్ సైన్యం దాడులు చేసింది. సుమారు 200 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటుతున్నారన్న సమాచారంతో వైమానిక దాడులు చేసిన సైన్యం, 100 మందిని హతమార్చింది. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ, తాము జరిపిన దాడులతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు పెను నష్టం జరిగిందని పేర్కొంది. ఇరాక్ లోని కొన్ని ప్రాంతాల్లో మిగిలివున్న ఉగ్రవాదులను సైతం ఏరివేసేందుకు దాడులు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.