: వచ్చే ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ సారథ్యం వహిస్తాడు: శ్రీనివాసన్


వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ 11లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఐసీసీ మాజీ చీఫ్ శ్రీనివాసన్ తెలిపారు. చెన్నైలో జరిగిన మద్రాస్‌ అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ అవార్డ్స్‌ లో ఆయన మాట్లాడుతూ, రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్నా తమ బ్రాండ్ పై ఆ విలువ పడలేదని అన్నారు. 2018 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అమోఘంగా పునరాగమనం చాటుతుందని అన్నారు. పసుపు రంగు జెర్సీలో ధోనీ నడిపిస్తుంటే అభిమానులు సంతోషిస్తారని తెలిపిన ఆయన, ఈ కోరిక వచ్చే ఏడాది తీరుతుందని అన్నారు. 

  • Loading...

More Telugu News