: ఆవు యూపీలో మమ్మీ... ఈశాన్యంలో యమ్మీ... బీజేపీ తీరుపై నిప్పులు చెరిగిన అసదుద్దీన్
గోమాంసం విషయంలో బీజేపీ తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తీసుకుంటున్న గో రక్షణ నిర్ణయాలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ విషయంలో బీజేపీది ద్వంద్వవైఖరి అని ఆయన స్పష్టం చేశారు. బీఫ్ ను నియంత్రించాలని భావిస్తే... బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. యూపీలో గోవును మమ్మీగా పేర్కొంటున్న బీజేపీ నేతలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం గోవును యమ్మీ (రుచికరమైన ఆహారం) గా చూస్తోందని ఆయన విమర్శించారు.