: హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. వరంగల్ రూరల్ లో వడదెబ్బకు ఒకరిమృతి
తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్, నిజామాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వరంగల్, కరీంనగర్, రామగుండం, కొత్తగూడెంలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో వడదెబ్బ తగిలి మహ్మద్ షరీఫుద్దీన్ (58) అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పగటిపూట ప్రయాణాలు తప్పనిసరి అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.