: పుంజుకోగలనన్న నమ్మకంతోనే ఆడాను... సైనా నెహ్వాల్ పై గెలిచాను: విజయంపై పీవీ సింధు


ఢిల్లీలోని శ్రీ ఫోర్ట్ కాంప్లెక్స్ లో నిన్న జ‌రిగిన ఇండియా ఓపెన్‌ సిరీస్‌లో క్వార్టర్స్ లో 21-16, 22-20 తేడాతో సైనాను పీవీ సింధు ఓడించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సింధు మీడియాతో మాట్లాడింది. త‌న‌కు సైనా నెహ్వాల్‌ ప్రత్యేకమేమీ కాదని సింధు వ్యాఖ్యానించింది. తాను ఎదుర్కోవాల్సిన క్రీడాకారిణుల్లో ఆమె కూడా ఒకరని, తలపడిన ప్రతిసారీ ఆమెపై గెలవాలనేమీ లేదని పేర్కొంది. తాను ఆట‌ల‌తో త‌న ప్ర‌త్య‌ర్థులంద‌రితోనూ బాగా రాణించాల‌నుకుంటాన‌ని, సైనా తోనూ అంతేన‌ని తెలిపింది. ఇది చాలా మంచి మ్యాచ్ అని, ప్రారంభం నుంచి సైనా ఆధిక్యంలోనే సాగిందని, కానీ ఆ స‌మ‌యంలోనూ తాను గెలవగలనని నమ్మానని చెప్పింది. తాను ఏ దశలోనూ అవకాశం వదులుకోలేద‌ని పేర్కొంది. సైనా 20-19తో ఆధిక్యంలోకి వెళ్లినప్పుడు కూడా తాను ఆత్మ‌విశ్వాసంతోనే ఆడాన‌ని సింధు తెలిపింది. కాగా, సింధు ఈ రోజు సాయంత్రం రెండో సీడ్‌ సంగ్‌ జి హ్యూన్‌తో సెమీఫైనల్లో పోరాడ‌నుంది.

  • Loading...

More Telugu News