: వెనకుంటే వెన్నుపోటు పొడుస్తారు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెన్నుపోటు వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. నెల్లూరులో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తన వెనుక ఎవరూ ఉండకూడదని అన్నారు. ఎవరైనా సరే ముందుంటే తాను ధైర్యంగా ఉండొచ్చని, వెనకుంటే వెన్నుపోటు పొడుస్తారని చమత్కరించడంతో అంతా పెద్దపెట్టున నవ్వేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.3.25 లక్షల కోట్లను ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.