: ముళ్ల పందిని మింగిన పాము పడ్డ నరకయాతన చూడండి!
బ్రెజిల్ లో చోటుచేసుకున్ని వింత ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. బాగా ఆకలితో ఉన్న పాము అటుగా వెళ్తున్న ముళ్ల పందిని మింగేసింది. పాముతో పోరాడి నోట్లోకి వెళ్లిపోయిన ముళ్లపంది...పాముకడుపు లోపలికి వెళ్తూ తన విశ్వరూపం చూపించింది. తన ముళ్లన్నిటినీ విప్పేసింది. దీంతో పాము శరీరం అంతటా ముళ్లు గుచ్చుకుపోయాయి. ఆకలికి ఆహారం తీసుకుంటే ప్రాణం మీదకి రావడంతో పాము నరకయాతనతో మెలితిరిగిపోయింది.
పాము శరీరం నుంచి ముళ్లు బయటకు పొడుచుకుని రావడంతో అదేదో కొత్త రకం అరుదైన జాతికి చెందిన పాము అనుకున్న అక్కడి స్థానికులు దానిని చిత్రంగా చూడడం మొదలు పెట్టారు. ఔత్సాహికులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది బోవా జాతికి చెందిన సర్పమని, ఇది ఆహారంగా గబ్బిలాలు, ఎలుకలు, పక్షులు, బల్లులను తీసుకుంటుందని, అయితే ఇది ముళ్లపందిని తినడం కొంత ఆశ్చర్యకరమేనని జంతు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.