: కుమార్తె ఫోటో చూసి తల్లి భయంతో వణికిపోయింది!!


తన కుమార్తెకు తాను తీసిన ఫొటోను చూసి ఆ తల్లి భయంతో వణికిపోయిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాకు చెందిన బియాంకా డికిన్‌ సన్ అనే మహిళ తన నలుగురు సంతానంతో సరదాగా బయటకు వెళ్లింది. కుటుంబం మొత్తం సరదాగా గడుపుతున్నారు. అక్కడే ఉన్న ఓ నెట్ దగ్గరకు చిన్న కుమార్తె మిచ్ వెళ్లి దూరంగా ఒరిగిన గడ్డిని చూపిస్తుండడంతో మురిసిపోయిన ఆ తల్లి... తన ముద్దుల చిన్నారిని అందంగా ఫొటోలో బంధించింది. అనంతరం అంతా ఇంటికి వెళ్లిపోయారు. తీరా ఇందాక తాను తీసిన ఈ ఫోటోను చూసి భయంతో వణికిపోయింది. ఎందుకంటే, కుమార్తెను ఫోటో తీసిన ఆనందంలో... తన చిన్నారికి రెండడుగుల దూరంలో ముదురు గోధుమ వర్ణంలో వున్న పెద్ద పామును ఆమె గమనించలేదు. అది ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ పాము తన కుమార్తెను ఏమీ చేయలేదని చెబుతూ... ఆ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టగా అది వైరల్ అవుతోంది. ఆ ఫోటోను మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News