: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆయన ఈ ఏడాది మే 8న కాలిఫోర్నియాలో ‘యూఎస్ఐబీసీ ట్రాన్స్ఫర్మెటివ్ చీఫ్ మినిస్టర్’ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును ఆయనకు యూఎస్-ఇండియా బిజినెస్ స్కూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మే 8న కాలిఫోర్నియాలో నిర్వహించే సమావేశంలో కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. ఈ సమావేశంలో 150కి పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు పాల్గొంటాయి.