: హెరిటేజ్‌కు ఈ రోజు రాజీనామా చేస్తున్నా: నారా లోకేశ్


హెరిటేజ్‌కు ఈ రోజు రాజీనామా చేస్తున్నానని టీడీపీ యువ‌నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్ర‌క‌టించారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. త‌న 9 ఏళ్ల హెరిటేజ్ ప్ర‌యాణంలో ఎన్నోవిజ‌యాలు సాధించాన‌ని, హెరిటేజ్ యాజ‌మాన్యం, సిబ్బంది సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని ప్ర‌శంసించారు. తాను ఎమ్మెల్సీగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం కొత్త అనుభూతినిస్తోంద‌ని, పెద్ద‌ల స‌భ‌లో చిన్న వాడినని అన్నారు. 34 ఏళ్ల‌కే మండ‌లిలో అడుగుపెట్టానని చెప్పారు. స‌భ‌లో అన్ని నేర్చుకుంటున్నానని, ప్ర‌తిప‌క్షం స‌భ‌లో నిన్న మంచి స‌ల‌హాలు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News