: నేడు తలపడనున్న బ్యాడ్మింటన్ సివంగులు... ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అభిమానులు!
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా, నేడు భారత బ్యాడ్మింటన్ రంగంలో సివంగులుగా ముద్రపడ్డ ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లు ముఖాముఖి తలపడనుండటంతో, ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా, స్టార్ స్పోర్ట్స్ చానల్ 2 ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అత్యధిక అభిమానులు పట్టే కోర్టు 1లో మ్యాచ్ జరగనుంది. క్వార్టర్ ఫైనల్స్ పోరులో ఈ ఇద్దరూ తలపడనున్నారు. అంతకుముందు 2014లో సయ్యద్ మోదీ గ్రాండ్ పిక్స్ పోటీలో భాగంగా వీరిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో తలపడిన వేళ, సింధూను సైనా వరుస సెట్లలో ఓడించిన సంగతి తెలిసిందే.