: కోహ్లీ కాకుంటే డివిలియర్స్ ఉన్నాడన్న డానియల్ వెట్టోరీ!
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో గాయపడి, నాలుగో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వచ్చే వారంలో ప్రారంభమయ్యే ఐపీఎల్ పోటీల సమయానికి ఫిట్ నెస్ సంపాదించుకోలేకుంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన కోహ్లీ కొన్ని మ్యాచ్ లకు దూరం కావాల్సి వస్తే... జట్టును నడిపించేందుకు ఏబీ డివిలియర్స్ సిద్ధంగా ఉంటాడని ఆర్సీబీ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరీ స్పష్టం చేశాడు. ఏప్రిల్ 2 నాటికి కోహ్లీ జట్టులోకి వచ్చి చేరుతాడని భావిస్తున్నామని, డాక్టర్లు, ఫిజియోలతో మాట్లాడిన తరువాతే కోహ్లీ ఆడటంపై ఓ నిర్ణయానికి వస్తామని అన్నాడు. కోహ్లీ అందుబాటులో లేకుంటే డివిలియర్స్ నేతృత్వంలో ముందుకు వెళతామని చెప్పాడు.