: నాలుగు రోజులుగా బురదకుంటలో 11 అడవి ఏనుగులు!


కంబోడియాలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో తిరుగుబాటుదారులు పేలుడు పదార్థం విసరడం వల్ల ఒక ప్రాంతంలో 3 మీటర్ల పొడవైన కుంట ఏర్పడింది. స్థానికులు నీటి కోసం దీనిని మరింత వెడల్పుగా, లోతుగా తవ్వారు. అడవికి దగ్గరగా ఈ కుంట ఉండడంతో అడవి నుంచి నీటి కోసం వచ్చిన పదకొండు ఏనుగులు ఆ కుంటలో దిగాయి. నీరులేక బురదగా మారిన ఆ కుంటలో అవి చిక్కుకుపోయాయి. సుమారు నాలుగు రోజులపాటు దాని లోంచి బయటకు రాలేక నానా ఇబ్బందిలు పడుతున్న వాటిని చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగ ప్రవేశం చేసిన అటవీ శాఖాధికారులు... బురద కుంట నుంచి ఏనుగులు వెళ్లేలా కొంత దారిని తవ్వారు. అనంతరం ఏనుగులు జారిపోయి పడిపోకుండా ఉండేందుకు, వాటి కాళ్లకు పట్టు దొరికేలా చెట్ల కొమ్మలను వేశారు. అంతే కాకుండా ఏనుగుల కోసం స్థానికులు ఆ కుంటలో నీరు పోశారని వారు తెలిపారు. దీంతో ఏనుగులు నెమ్మదిగా ఆ బురద కుంటలోంచి బయటకు వచ్చి, అడవిలోకి పరుగులు తీశాయి. స్థానికులు వాటిని గుర్తించని పక్షంలో ఏనుగులు మరణించి ఉండేవని వారు తెలిపారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News