: ఏపీ అసెంబ్లీలో అలా చేస్తున్నారు.. తెలంగాణ అసెంబ్లీలో ఇలా చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో టీడీపీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి, ఏపీ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీలో ఏమీ మాట్లాడకుండానే బయటకు పంపేస్తున్నారని అన్నారు. ఏపీలో మాత్రం పరిస్థితి అలా లేదని, స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి ప్లకార్లులు ప్రదర్శిస్తోన్నా చాలా ఓపిగ్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ సభలో జరుగుతున్న ఈ తీరుని ఏపీ సభలో ప్రస్తావించాలని ఆయన అన్నారు. అనంతరం బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ... తమ అసెంబ్లీలోనూ కేసీఆర్ చూపిస్తోన్న మార్గంలో వెళితే తప్ప వైసీపీ దారికొచ్చేలా కనిపించడం లేదని అన్నారు.