: మాల్దీవుల్లో వాలిపోయిన సల్మాన్ కుటుంబం... మేనల్లుడి బర్త్ డే సెలబ్రేషన్స్ అదుర్స్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ కుమారుడు అహిల్ మొదటి పుట్టిన రోజు నేడే. ఈ వేడుకలను అదిరిపోయేలా చేసుకునేందుకు సల్మాన్ ఖాన్ జంబో కుటుంబం మొత్తం కూడా ప్రత్యేక విమానంలో మాల్దీవుల్లో వాలిపోయింది. అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా, లులియావాంటర్, అల్వీరా, అతుల్ అగ్నిహోత్రి, అమ్రిత అరోరా, సల్మా, హెలెన్, స్నేహితులు, వారి పిల్లలు వీరిలో ఉన్నారు. వాస్తవానికి సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' చిత్రం షూటింగ్ లో భాగంగా ఆస్ట్రియాలో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ మేనల్లుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొనేందుకు ఆయన సైతం తప్పకుండా మాల్దీవులకు చేరుకుంటాడని భావిస్తున్నారు.