: ధోనీ ఆధార్ వివరాలను బయటకు చెప్పిన ఎన్ రోల్ మెంట్ కేంద్రంపై పదేళ్ల నిషేధం


ఇండియన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆధార్ వివరాలను బహిర్గతం చేసిన ఎన్ రోల్ మెంట్ కేంద్రాన్ని పదేళ్ల పాటు నిషేధిస్తున్నట్టు యూఐడీఏఐ (యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఈ విషయాన్ని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ధోనీ ఆధార్ రిసీట్ ను సోషల్ మీడియాలో ఉంచిన ఎన్ రోల్ మెంట్ కేంద్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఆయన తెలిపారు. కాగా, తన భర్త ఆధార్ సమాచారం లీక్ అయిందని సాక్షీ సింగ్ రావత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటులో మాజీ, ప్రస్తుత ఆర్థిక మంత్రులు చిదంబరం, జైట్లీల నడుమ ఆసక్తికర వాగ్వాదం కూడా జరిగింది.

  • Loading...

More Telugu News