: నిర్ణయం మార్చుకున్న ఆర్బీఐ.. ఏప్రిల్ 1న బ్యాంకుల మూత
ఆర్బీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు శని, ఆదివారాలు, ఇతర సెలువు దినాల్లో కూడా బ్యాంకులు పనిచేయాలని ఆదేశించిన భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా ఏప్రిల్ 1న మూసి వేయాలంటూ ఆదేశించింది. ఆరోజు బ్యాంకులను తెరవడం వల్ల వార్షిక క్లోజర్ సాఫీగా సాగే అవకాశం ఉండదని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తున్నందున నిర్ణయాన్ని సవరించినట్టు పేర్కొంది.