: వాట్ ఏ క్యాచ్!... భుజాన్ని బలంగా తాకినా... బంతిని ఒడిసిపట్టేసిన బంగ్లాదేశ్ ఆటగాడు!


శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ పట్టిన క్యాచ్ పట్ల క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నప్పుడు క్రీజులో కుదురుకున్న బ్యాట్స్ మన్ ను అవుట్ చేసేందుకు బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తారు. బౌన్స్ పై అంచనా దొరికి బ్యాట్స్ మన్ బౌలర్ సంధించిన వేగానికి ఉత్తేజితమై మరింత దూకుడుగా బంతిని బౌండరీ లైన్ దాటించాలని ప్రయత్నిస్తాడు. సెంచరీతో దూసుకెళ్తున్న లంక బ్యాట్స్ మన్ కుశాల్ మెండీస్ కు బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్ యార్కర్ వంటి బంతిని వేగంగా సంధించాడు. దానిని కుశాల్ మెండీస్ నేరుగా స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు.

సంధించిన బంతి సెకెన్ల వ్యవధిలో తిరిగిరావడంతో ఊహించని టస్కిన్ అహ్మద్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేక, చేతులు అడ్డం పెట్టాడు. అది బలంగా అతని భుజాన్ని తాకి మరింత పైకి లేచింది. బలంగా తగిలిన దెబ్బకు విలవిల్లాడిన టస్కిన్ అహ్మద్ బంతి ఎక్కడి కెళ్లిందో తెలియకు తికమకపడ్డాడు. ఇంతలో బంతి అంపైర్ పక్కన పడుతుండడంతో పరుగున వెళ్లి ఒడిసిపట్టేశాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. లిప్త పాటు కాలంలో జరిగిన ఈ అద్భుతానికి అంతా షాక్ అయినా...సెంచరీ వీరుడు అవుట్ కావడంతో సంబరాలు చేసుకున్నారు. జట్టు సహచరులంతా అతనిని కౌగిలించుకుంటే టస్కిన్ అహ్మద్ మాత్రం దెబ్బకు విలవిల్లాడిపోయాడు. ఈ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైనప్పటికీ ఈ మ్యాచ్ లో ఈ క్యాచ్ అందర్నీ ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News