: గంటా కుమారుడు రవితేజ సినిమా పేరు 'జయదేవ్'

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అల్లుడు రవితేజ టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్న సినిమా పేరును 'జయదేవ్' అని నిర్ణయించినట్టు దర్శకుడు జయంత్ సీ పరాన్జీ తెలిపారు. ఉగాది సందర్భంగా తమ సినిమాకు 'జయదేవ్' పేరును ఖరారు చేశామని ఆయన చెప్పారు. కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసిన పోలీసుల జీవితాల ఆధారంగా తయారు చేసిన అద్భుత కథ ఇదని ఆయన అన్నారు. ఈ సినిమాలో సుమారు పది యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఆయన చెప్పారు. రవి నటన ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక నటిస్తుండగా ఈ సినిమాలో ఇతర పాత్రలలో వినోద్ కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌ తదితరులు నటించారు. 

More Telugu News