: ఉగాది రోజున లోక్ సభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ


తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఉగాది వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ... లోక్ సభలో ఓ తెలుగు ఎంపీ మాతృభాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. నేటి పార్లమెంటు సమావేశాలకు హాజరైన టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగులోనే ప్రసంగించి ఆకట్టుకున్నారు. తొలుత పార్లమెంటు సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ నాయుడు... తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుచెరుగలా చాటిచెప్పిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News