: ఏప్రిల్ 2న అభిమానులతో అత్యవసర సమావేశం.. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం?
ప్రముఖ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు అభిమానులంతా ఏప్రిల్ 2న చెన్నై రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆ రోజు అభిమానులతో నిర్వహించే సమావేశంలో రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారని తమిళనాడులో వార్తలు వెలువడుతున్నాయి. తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ శూన్యత నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజాగా ఆయనను శ్రీలంకలో తమిళులను కలవవద్దంటూ పలు పార్టీలు సూచించిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకుని, బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆయన ఏప్రిల్ 2న అభిమానులంతా చెన్నై రావాలని లేఖలు రాయడంతో ఆయన రాజకీయాల్లోకి రానున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, ఈ మధ్యే కమల హాసన్ కూడా తన అభిమానులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.