: మారని ఆసీస్ మీడియా... కోహ్లీతో పాటు రహానేను కూడా దుమ్మెత్తిపోసింది!
ఆస్ట్రేలియా మీడియా తీరు మారలేదు. భారత్ లో ఆస్ట్రేలియా జట్టు అడుగుపెట్టిన నాటి నుంచి ఏదో రకమైన వివాదం రేపుతూ ఆడిపోసుకుంటున్న ఆసీస్ మీడియా టోర్నీలో పరాజయం పాలైనా విమర్శల పరంపరను ఆపలేదు. తాజాగా టీమిండియా కెప్టెన్ కోహ్లీతో పాటు చివరి టెస్టు కెప్టెన్ అజింక్యా రహానేను దుమ్మెత్తిపోసింది. కోహ్లీ క్లాస్ లెస్ ఆటగాడని తెలిపింది. స్టీవ్ స్మిత్ పెద్దరికంతో క్షమాపణలు చెబితే... కోహ్లీ అలా చెప్పకుండా మంకుపట్టు పట్టి చిన్నపిల్లాడిలా వ్యవహరించాడని ఆడిపోసుకుంది. టోర్నీలో విజయం అనంతరం కోహ్లీని ఆసీస్ ఆటగాళ్లు స్నేహితుడిలా చూడరని పేర్కొంది. కోహ్లీని ఉన్మాదిగా డైలీ టెలిగ్రాఫ్ అనే పత్రిక పేర్కొంది. అలాగే రహానేను బీర్ పార్టీకి ఆసీస్ జట్టు ఆటగాళ్లు ఆహ్వానిస్తే వెళ్లకుండా తప్పించుకున్నాడని, అది సంస్కారం కాదని ఆసీస్ మీడియా అభిప్రాయపడింది.