: లౌకిక కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్?


2019 సార్వత్రిక ఎన్నికలపై అన్ని పార్టీలు అప్పుడే కసరత్తును ప్రారంభిస్తున్నాయి. అధికార బీజేపీని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులన్నీ ఏకమై ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లౌకికి కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను బరిలోకి దించేందుకు జేడీయూ సిద్ధమైంది. నితీష్ పరిపాలనాదక్షుడని, దూరదృష్టి కలిగిన నేత అని జేడీయూ అధికార ప్రతినిధి భారతీ మెహతా చెప్పారు. లౌకిక శక్తుల నేతగా నితీష్ ను తాము అంగీకరించామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా నితీష్ తీసుకున్న నిర్ణయాలు... బీహార్ లో పెను మార్పులను తీసుకొచ్చాయని ఆయన కొనియాడారు. మరి, ఇతర పార్టీలు నితీష్ అభ్యర్థిత్వాన్ని ఎంత వరకు సమర్థిస్తాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News