: రూ.47 రీచార్జ్ తో 56 జీబీ 4జీ డేటా.. బంపర్ ఆఫర్ ప్రకటించిన టెలినార్
టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో తీసుకొచ్చిన విపరీతమైన పోటీతో మిగతా కంపెనీలన్నీ తమ వినియోగదారులను కోల్పోకుండా ఎన్నో ఆఫర్లు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్ టెల్ వంటి అన్ని టెలికాం కంపెనీలు పోటీపడి ఆఫర్లు గుప్పించగా తాజాగా అదే బాటలో పయనిస్తూ నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ ఈ రోజు ఓ అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.47 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో 56 జీబీ 4జీ డేటాను ఇస్తున్నట్లు పేర్కొంది.
అయితే రోజుకు గరిష్టంగా 2 జీబీ డేటాను వాడే వినియోగదారులు మాత్రమే ఈ ప్లాన్ ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటా అందుతుందని చెప్పారు. ఇప్పటికే తాము ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవడానికి అర్హతగల యూజర్లకు ఎస్ఎంఎస్ లు పంపామని పేర్కొన్నారు.