: మురళీ విజయ్ 8, పుజారా 0... ఆదిలోనే రెండు వికెట్లు డౌన్!


ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో 106 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన భారత జట్టును ఆదిలోనే ఆస్ట్రేలియా దెబ్బతీసింది. ఈ ఉదయం ఆట ప్రారంభమైన తరువాత 8 పరుగులు చేసిన ఓపెనర్ మురళీ విజయ్ ని కుమ్మిన్స్ అవుట్ చేయగా, ఆపై వన్ డౌన్ లో వచ్చిన పుజారా డక్కౌట్ అయ్యాడు. తన స్కోరు ఖాతాను ప్రారంభించకుండానే మాక్స్ వెల్ విసిరిన బంతికి రన్నౌటై పెవీలియన్ దారి పట్టాడు. దీంతో క్రీజులో ఉన్న రాహుల్ కు జతగా రహానే వచ్చి చేరాడు. ప్రస్తుతం రాహుల్ 38, రహానే 11 పరుగులతో ఆడుతుండగా, భారత స్కోరు 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు. భారత్ చిరస్మరణీయ సిరీస్ విజయానికి మరో 44 పరుగులు చేస్తే సరిపోతుంది.

  • Loading...

More Telugu News