: దిగ్విజయ్ సింగ్ ఔట్.. త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరు ఇన్‌చార్జ్‌లు!

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. పెద్ద పదవుల నుంచి వృద్ధ నేతలను సాగనంపాలని నిర్ణయించుకున్న ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌కు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. ఆయనను తప్పించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా ఇన్‌చార్జ్‌లను నియమించాలని భావిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన కంటే ముందే ఈ మార్పు ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణలకు ఇన్‌చార్జ్‌లను నియమించే ముందు రెండు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్ చర్చించనున్నట్టు సమాచారం.


More Telugu News