: మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. ఎన్నికల్లో ఘన విజయంపై శుభాకాంక్షలు
భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించినందుకు మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శ్వేతసౌధ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ ఓ ప్రకటన చేశారు. ఇదివరకు ట్రంప్.. మోదీకి ఫోన్ చేసినా, భారత్ అంతర్గత విషయాలపై ఆయన స్పందించడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఆయన ఫోన్‌కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై వీరిరువురు చర్చించిందీ లేనిదీ తెలియరాలేదు. కాగా, జర్మనీలో జరిగిన తాజా ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మెర్కెల్‌కు కూడా ట్రంప్ శుభాకాంక్షలు తెలిపినట్టు సీన్ స్పైసర్ పేర్కొన్నారు.