: వివేక్ ఓబెరాయ్ స్కూల్ లో సురేష్ రైనా పాఠాలు!
సామాజిక సేవలో బాలీవుడ్ నటుల్లో అందరికంటే ముందుండే ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ స్కూల్ లో టీమిండియా టీ20 స్పెషలిస్టు బ్యాట్స్ మన్ సురేష్ రైనా పాఠాలు చెప్పనున్నాడు. ముంబైలో వివేక్ ఒబెరాయ్ ఒక పాఠశాలను నెలకొల్పాడు. ఈ పాఠశాలలో చదువుకునే వారంతా దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్నారులే. ఇందులో ఆడపిల్లలకు విద్య ఉచితం, ఇతరులకు నామమాత్రపు ఫీజుతో అత్యుత్తమ విద్య అందిస్తున్నారు.
అందులో భాగంగా ఈ స్కూల్ లో విద్యార్థుల్లో స్పూర్తి రగిలించేందుకు సెలబ్రిటీలను ఒప్పించి, వారితో ప్రత్యేకంగా పాఠాలు చెప్పిస్తుంటాడు వివేక్ ఒబెరాయ్. ఇలాంటి ప్రత్యేక వర్క్‌షాప్ లో సురేష్ రైనా పాఠాలు చెప్పనున్నాడు. గాయకుడు సురేశ్ వాడేకర్, కొరియోగ్రాఫర్ రెమో డిసోజాతో కూడా ప్రత్యేకంగా పాఠాలు చెప్పించనున్నారు. తద్వారా చిన్నారులు మెరుగ్గా ఆలోచించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని వివేక్ ఒబెరాయ్ భావిస్తున్నాడు.