: పశువధను కొన్ని చోట్లే ఎందుకు నిషేధిస్తున్నారు.. అన్ని రాష్ట్రాల్లోనూ నిషేధించాలి!: సమాజ్ వాదీ నేత ఆజంఖాన్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు అక్రమ కబేళాలను మూసివేయించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ స్పందిస్తూ... దేశవ్యాప్తంగా ఆవులు సహా పశువధపై నిషేధం విధించాలని ప‌లు వ్యాఖ్యలు చేశారు. పశువధను కొన్ని చోట్లే ఎందుకు నిషేధిస్తున్నారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి అంశాల్లో అన్ని రాష్ట్రాల్లో నిబంధ‌న‌లు ఒకే విధంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
 
అంతేగాక‌, అక్ర‌మ క‌బేళాలు ఉంటే మాత్ర‌మే త‌ప్పా? లైసెన్స్‌ ఉన్న కబేళాల్లో పశువులను వధిస్తే తప్పు లేదా? అని ఆజంఖాన్ ప్ర‌శ్నించారు. అసలు జంతువులను వధింకూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. జైనులు తదితర మతస్తులు కోళ్లు, మేకలను కూడా చంపకూడ‌ద‌ని, ముస్లింలు కూడా మాంసం తినడం ఆపేయాలని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News