: డొనాల్డ్ ట్రంప్ ప్రభావం: అమెరికాలో పడిపోతున్న విదేశీ విద్యార్థుల దరఖాస్తులు
తమ దేశంలో విదేశీయుల ప్రవేశం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు, నిబంధనల ఫలితంగా ఆ దేశంలోని యూనివర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల దరఖాస్తులు తగ్గిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినతరమైన వీసా నిబంధనలతో పాటు అమెరికాలో జాతి విద్వేషపూరిత దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 250కి పైగా అమెరికన్ కాలేజీల్లో, ఆరు టాప్ అమెరికన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ లో భారతీయుల అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులు 26 శాతం తగ్గిపోయినట్లు ఓ సర్వేలో తేలింది. కాగా, గ్రాడ్యుయేట్ దరఖాస్తులు కూడా 15 శాతం తగ్గిపోయాయి.
మరోవైపు అమెరికాలో విదేశీ విద్యార్థుల అప్లికేషన్లు కూడా సగటున 40 శాతం తగ్గాయి. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో సగం శాతం మంది విద్యార్థులు చైనా, భారత్ కు చెందిన విద్యార్థులే ఉంటారు. చైనా నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ దరఖాస్తులు 25 శాతం, గ్రాడ్యుయేట్ స్టడీస్ దరఖాస్తులు 32 శాతం తగ్గిపోయాయి. ఈ ప్రభావం భవిష్యత్తులో కూడా ఉండనుందని సర్వేలో పేర్కొన్నారు.