: అలా జరిగితే.. మడకశిర నుంచి రఘువీరా మళ్లీ పోటీ చేస్తారట!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాలోని మడకశిర, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అయితే, 2009 నుంచి మడకశిర నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో, కల్యాణ దుర్గం నుంచి నాడు పోటీ చేసిన రఘువీరా విజయం సాధించారు. అయితే, 2014లో రాష్ట్ర విభజన అనంతరం అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీరారెడ్డి మళ్లీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి.. కల్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి కాకుండా, మడకశిర నియోజకవర్గం నుంచే మళ్లీ బరి లోకి దిగాలని ఆయన చూస్తున్నారని రఘువీరా వర్గాల సమాచారం.  ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్ గా ఉన్న మడకశిర నియోజకవర్గం.. వచ్చే ఎన్నికల నాటికి ఆ కోటా నుంచి బయటపడుతుందనే ఆశాభావంతో రఘువీరా ఉన్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మడకశిర రెండు నియోజకవర్గాలుగా చీలుతుందని.. అప్పుడు.. అందులో ఏర్పడే రెండో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ గా ఉన్నా, మడకశిర మాత్రం ఏ కోటాలో ఉండదని .. అక్కడి నుంచి తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందని రఘువీరారెడ్డి భావిస్తున్నారట.

  • Loading...

More Telugu News