: తండ్రి ఏడుపు చూళ్లేకపోయిన రాజమౌళి కుమార్తె!


ప్రముఖ దర్శకుడు రాజమౌళి కన్నీరు పెట్టుకోవడాన్ని ఆయన కుమార్తె చూళ్లేకపోయిన ఘటన 'బాహుబలి- ది కన్ క్లూజన్' సందర్భంగా చోటుచేసుకుంది. రాజమౌళి ఎందుకు కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చిందనుకుంటున్నారా?...  'బాహుబలి- ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా, కీరవాణి మాట్లాడుతున్నప్పుడు తమ్ముడి (రాజమౌళి) ప్రతిభను కీర్తిస్తూ, ఒక పాటను రచించి, పాడి వినిపించారు. చిరకాలం వర్ధిల్లు అంటూ మనసారా దీవించారు. ఆ సమయంలో పెద్దన్నయ్య నోట పొగడ్తలు విన్న రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. వేదికపై నుంచి కళ్లు తుడుచుకుంటూ కిందికి దిగాడు.

రాజమౌళిలో ఇంతవరకు ఈ యాంగిల్ ని చూడని నిర్మాతలు, నటులు అంతా విస్మయం చెందారు. దీంతో అంతా రాజమౌళిని ఓదార్చారు. తండ్రి కన్నీరు పెట్టుకోవడం చూసిన రాజమౌళి కుమార్తె తండ్రి దగ్గరకెళ్లి, గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో అందరి కళ్లు చెమర్చగా, రాజమౌళి కూతుర్ని సముదాయించారు.  

  • Loading...

More Telugu News