: పెదనాన్నను వేదిక మీదకు తీసుకెళ్లి... కిందికి తీసుకొచ్చిన ప్రభాస్!
యంగ్ రెబరల్ స్టార్ ప్రభాస్ కుటుంబానికి ఇచ్చే విలువ 'బాహుబలి -ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బయటపడింది. తన పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు వేదిక ఎక్కేందుకు వెళ్లగా... ఆయనను వేదిక ఎక్కించేందుకు ప్రభాసే స్వయంగా తోడుగా వెళ్లాడు. ప్రభాస్ భుజం పట్టుకుని కృష్ణంరాజు వేదిక ఎక్కారు. వేదిక ఎక్కిన అనంతరం తన స్పీచ్ ముగించి వెనుదిరగగానే స్టేజ్ మీదకు వెళ్లిన ప్రభాస్ మళ్లీ ఆయనకు ఊతంగా నిలబడి వేదిక దించాడు. ఇది అక్కడున్న అభిమానులందర్నీ ఆకట్టుకుంది.