: ఢిల్లీలో అరుణ్ జైట్లీని కలిసిన సినీ నటులు విశాల్, ప్రకాశ్‌రాజ్
తమిళనాడులో కరవు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకోవాలని నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సినీ నటులు విశాల్, ప్రకాశ్ రాజ్ రైతులతో కలిసి ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ఈ రోజు వారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. రైతుల సమస్యలను జైట్లీ దృష్టికి తీసుకెళ్లామని, విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరవు పరిస్థితులు తలెత్తడంతో అక్కడి రైతులు ఆందోళన బాట పట్టారు. సర్కారు వెంటనే తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.