: సొంత పార్టీ సభ్యుల తీరుతో కాంగ్రెస్ విప్ సంపత్ ఆగ్రహం.. విప్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన
తమ పార్టీ శాసనసభ్యులపై కాంగ్రెస్ విప్ సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సొంత పార్టీ నేతలే తనను అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదని అన్నారు. తాను ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మాట్లాడదామనుకున్నానని అయితే, తనకు అవకాశం దొరకలేదని అన్నారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చేలా తమ సభ్యులు మద్దతు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను తన సీఎల్‌పీ విప్ పదవికి రాజీనామా చేయనున్నట్లు పేర్కొన్నారు.