: సహచరులకు డ్రింక్స్ అందిస్తూ ...సూచనలిచ్చిన కోహ్లీ!
టీమిండియా కెప్టెన్ 'డ్రింక్స్ బాయ్' అవతారమెత్తాడు. గాయం కారణంగా చివరి టెస్టుకు దూరమైన కోహ్లీ ఆటను చూస్తూ మైదానంలో ఉండలేకపోతున్నాడు. ఆడాలని కుతూహలమున్నా గాయం సహకరించని కారణంగా పెవిలియన్ కు పరిమితమైన సంగతి తెలిసిందే... దీంతో జట్టులోని సహచరులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డ్రింక్స్ టైంలో మైదానంలోకి వచ్చాడు. సహచరులకు డ్రింక్స్ ఇస్తూ విలువైన సలహాలు వారితో పంచుకున్నాడు. కోహ్లీ ఒక్కసారిగా మైదానంలో కనిపించడంతో అభిమానులు కోహ్లీ...కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు.