: ఏయూలో సిబ్బంది కీచులాటకు విద్యార్థుల బలి!
ఆంధ్రాయూనివర్సిటీ సిబ్బంది మధ్య విభేదాలు విద్యార్థులకు గండంగా మారాయి. ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలోని యోగా విలేజ్ లో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సులో 42 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ మధ్యే జరిగిన ఆల్ ఇండియా యోగా కాంపిటీషన్ కు కూడా వెళ్లి వచ్చారు. యూనివర్సిటీ నిర్వహించిన సెమ్ లో వచ్చిన ఫలితాలు చూసి విద్యార్థులు షాక్ తిన్నారు. మొత్తం బ్యాచ్ లో 42 మంది విద్యార్థులు ఉండగా, 41 మంది ఫెయిల్ అయ్యారు.
ఇదెలా సాధ్యమైందని ఆరాతీయగా, యూనివర్సిటీలోని సిబ్బంది మధ్య విభేదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని తెలిసిందని విద్యార్థులు వాపోతున్నారు. తమలో అంత సమర్థలేకపోతే...తమను ఆల్ ఇండియా యోగా కాంపిటీషన్ కు ఎలా పంపారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది మధ్య వ్యక్తిగత విభేదాలు తమపాలిట శాపంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనకు దిగుతామని వారు ప్రకటించారు.