: అమెరికా ఉన్నత భద్రతాధికారులతో అజిత్ ధోవల్ సమావేశం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రెండోసారి ఆ దేశ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉన్నత భద్రతాధికారులు, అమెరికా రక్షణ విభాగం సెక్రటరీ రిటైర్డ్‌ జనరల్‌ జేమ్స్‌ మాట్టిస్‌, హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ రిటైర్డ్‌ జనరల్‌ జాన్‌ కెల్లీ, అక్కడి జాతీయ భద్రత సలహాదారు లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ ఆర్‌ మెక్‌ మాస్టర్‌ లతో ధోవల్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఇరు దేశాలు తీసుకోవలసిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చించారు. ఈ రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, దక్షిణాసియాకు పొంచిఉన్న ఉగ్రవాద ముప్పు, తీరప్రాంత భద్రత, స్థానిక భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని ట్రంప్ ఉన్నతాధికారులు ఆకాంక్షించగా, ఈ చర్చలు సానుకూల వాతావరణంలో నిర్మాణాత్మకంగా జరిగాయని అజిత్ ధోవల్ తెలిపారు. 

More Telugu News