: ఇప్పటి దాకా నలుగురితో సహజీవనం చేశా!: ముమైత్ ఖాన్
మూడేళ్ల క్రితం వరకు ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముమైత్ ఖాన్... ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కొత్త భామలు చాలా మంది ఎంట్రీ ఇవ్వడంతో ముమైత్ కు ఆఫర్లు తగ్గిపోయాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, షాకింగ్ నిజాలను వెల్లడించింది ముమైత్. ఇప్పటి వరకు తాను నలుగురితో సహజీవనం చేశానని ముమైత్ తెలిపింది. అయితే ఆ బంధాలన్నీ ముగిసిపోయాయని చెప్పింది.
తన తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగిందని పేర్కొంది. రెండో సహజీవనం మూడున్నర ఏళ్ల పాటు కొనసాగితే... మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు కలసి ఉన్నానని చెప్పింది. చివరి బంధం మాత్రం కేవలం ఏడాదిన్నరలోనే బెడిసికొట్టిందని తెలిపింది. తాను స్నేహపూర్వకమైన వ్యక్తినని, చాలా రొమాంటిక్, చాలా కేరింగ్ అని చెప్పింది. అయితే, ఇకపై ఎలాంటి బంధాలు, సంబంధాలు వద్దనుకుంటున్నానని తెలిపింది. ఇకపై డబ్బును కూడా వేస్ట్ చేయదల్చుకోలేదని చెప్పింది.
ఒక వ్యక్తితో బంధం కోసం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని... ఆ ఆపరేషన్ కోసం రూ. 27 లక్షలు ఖర్చయిందని ముమైత్ తెలిపింది. ప్రస్తుతం తన మెదడులో 9 ఖరీదైన టైటానియం వైర్లు ఉన్నాయని... దీంతో, తనకు ఓ ఎక్స్ మెన్ అనే భావన కలుగుతోందని చెప్పింది. ఇకపై, ఎవరి కోసమో ఇలాంటి వాటిపై తన డబ్బును ఖర్చు పెట్టదలచుకోనని తెలిపింది. ప్రస్తుతం ముమైత్ కు సినిమా ఛాన్సులు రావడం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను పెట్టి దాని కార్యక్రమాలను చూసుకుంటోంది.