: ‘బెనిఫిట్ షో’ లేదనడంతో పవన్ అభిమానుల నిరసన!


ఈ రోజు విడుదలైన ‘కాటమరాయుడు’ చిత్రం బెనిఫిట్ షోలు లేకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. హైదారాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో బెనిఫిట్ షోలు లేకపోవడంపై వారు నిరాశ చెందారు. ఈ రోజు తెల్లవారుజామున ‘బెన్ ఫిట్ షో లేదు’ అనే బోర్డులను ఆయా థియేటర్ల ముందు చూసిన పవన్ అభిమానులు అప్సెట్ అయ్యారు. దీంతో, రోడ్డుపైకి చేరి ట్రాఫిక కు అంతరాయం కలిగించిన పవన్ అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఆయా థియేటర్ల యాజమాన్యం మాట్లాడుతూ, ‘కాటమరాయుడు’ బెన్ ఫిట్ షో వేసేందుకు తమకు అనుమతిలేదని, అందువల్లే, తాము ప్రదర్శించలేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News