: ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త!


సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో స్ట్రీమింగ్‌ సదుపాయాన్ని రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ అధికంగానే ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతవరకు స్మార్ట్ ఫోన్లలోనే ఉన్న ఈ స‌దుపాయం ఇక‌పై డెస్క్‌టాప్‌, ల్యాప్‌ట్యాప్‌ కంప్యూటర్లలోనూ అందుబాటులోకి రానుంది. వెబ్‌క్యామ్‌ సాయంతో యూజ‌ర్లు డెస్క్‌టాప్‌ల నుంచే వీడియోను ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. డెస్క్‌టాప్‌లో వచ్చే ఫేస్‌బుక్‌ సైట్‌లో స్టేటస్‌ అప్‌డేట్‌ బాక్స్‌లో చివర్లో ‘లైవ్‌ వీడియో’ అని ఆప్షన్ క‌నిపిస్తుంద‌ని చెప్పారు. ఈ స‌దుపాయం గేమింగ్‌ కంపెనీలకు ఎంత‌గానో ఉపయోగపడనుంది. ఎందుకంటే, ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌, ఫాలోవర్లకు కంప్యూటర్లలో గేమ్‌ప్లేను లైవ్‌ స్ట్రీమ్‌ చేయవచ్చు. యూజ‌ర్లు ఈ గేమ్స్ వారికి చూపించవచ్చు. అంతేగాక‌ వీటితోపాటు ట్యూటోరియల్స్ కూడా చెప్పుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News